- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారణాసిలో ప్రధాని పై పోటీ చేస్తున్న కమెడియన్..ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ,వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. ఈ స్థానం నుంచి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా..36 మంది పత్రాలను అధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ఈ క్రమంలో యూపీలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కారణం ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌కి చెందిన శ్యామ్ ప్రధాని గొంతును అనుకరిస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.
ఈ ఎన్నికల్లో ప్రధాని పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి వార్తల్లో నిలిచారు. అయితే ఆయన నామినేషన్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని రెండు రోజుల క్రితం ఆరోపించారు. మొదటగా మే 10, 13వ తేదీల్లో నామినేషన్ వేయడానికి వెళితే తన పత్రాలు ఎవరూ తీసుకోలేదని ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఎట్టకేలకు నామినేషన్ చివరి రోజు పగటి పూట నామినేషన్ల ముగింపు గడువుకు రెండు నిమిషాల ముందు నామినేషన్ వేసినట్లు చెప్పారు. అయితే మరుసటి రోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్ రంగీలా పత్రాలు సంపూర్ణంగా లేదని అఫిడవిట్ పై ప్రమాణం చేయలేదని అధికారులు అతని నామినేషన్ తిరస్కరించారు.