- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువతకు బంపర్ ఆఫర్.. డేటింగ్ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. పైగా వారే!!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రభుత్వాలు డేటింగ్ యాప్ ను ప్రోత్సహించవు. ఈ యాప్ వల్ల మేలు కంటే కీడు ఎక్కువని భావిస్తాయి. ఎందుకంటే డేటింగ్ పేరుతో స్కామ్‌లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా జపాన్ రాజధాని టోక్యో ఒక డేటింగ్ యాప్ తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే డేటింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకోస్తామని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ డేటింగ్ యాప్‌లో చేరాలంటే వినియోగదారులు కొన్ని డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేయాలి. సింగిల్ అని నిర్ధారణ అయితే పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నామని సంతకాలు పెట్టిన లేఖను జత చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు వార్షిక వేతనాన్ని నిర్ధారించే ట్యాక్స్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి డేటింగ్ యాప్స్‌ని ప్రభుత్వాలు తీసుకురావడం అనేది అరుదు.
కానీ జపాన్‌లో జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోతుండడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లుగా జపాన్‌లో జననాల రేటు క్షీణిస్తూ వస్తుంది. కాగా పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చే జననాల రేటు పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకే వారు సరైన భాగస్వామిని ఎంచుకునేందుకు ఈ డేటింగ్ యాప్ సహాయపడుతుందని ఒక అధికారి వెల్లడించారు. కాగా ఈ డేటింగ్ యాప్‌పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. జననాల రేటు వృద్ధి అంశం ప్రాముఖ్యతను జపాన్ ప్రభుత్వం గుర్తించినందుకు ఆనందంగా ఉందని, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే జపాన్ లాంటి దేశాలు అదృశ్యమవుతాయని,. నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందని, నాగరికత క్షీణించడాన్ని చూస్తూ ఉండలేమని మస్క్ రాసుకొచ్చారు.