UNGA: స్మార్ట్ ఫోన్లతో భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు

by Shamantha N |
UNGA: స్మార్ట్ ఫోన్లతో భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ప్రెసిడెంట్ డెన్నిస్ ఫ్రాన్సిస్ భారతదేశ డిజిటల్ విప్లవాన్ని ప్రశంసించారు. డిజిటలైజేషన్ భారత్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించారని కొనియాడారు. గత ఐదారేళ్లలో స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడగలిగారన్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ద్వారా బిల్లులు చెల్లించడం మరియు ఆర్డర్‌ల కోసం చెల్లింపులను స్వీకరించడం ఎలాగో ఆయన హైలైట్ చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)లో ఫ్రాన్సిస్ ప్రసంగించారు. "డిజిటలైజేషన్ వేగవంతమైన అభివృద్ధికి ఒక దేశం ప్రాతిపదికను అందిస్తుంది. ఉదాహరణకు, భారతదేశం విషయమే తీసుకోండి. గత ఐదారేళ్లలో కేవలం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ద్వారా 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడేయగలిగింది. భవిష్యత్తు తరాల కోసం జీరో హంగర్ దిశగా పురోగతిని వేగవంతం చేయాలి" అని అన్నారు.

స్మార్ట్ ఫోన్లలో లావాదేవీలు

బ్యాంకింగ్ వ్యవస్థతో ఎన్నడూ సంబంధం లేని భారతదేశంలోని గ్రామీణ రైతులు ఇప్పుడు వారి అన్ని వ్యాపారాలను వారి స్మార్ట్‌ఫోన్‌లో లావాదేవీలు చేయగలుగుతున్నారని అన్నారు. వారు తమ బిల్లులు చెల్లించి, ఆర్డర్‌ల కోసం చెల్లింపులను స్వీకరిస్తారని తెలిపారు. భారత్ లోని ప్రతిఒక్కరూ ఇంటర్నెట్ వాడుతున్నారని తెలిపారు. కానీ గ్లోబల్ సౌత్‌లోని అనేక ప్రాంతాలలో అలా కాదన్నారు. డిజిటలైజేషన్ కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌పై చర్చలు జరపాలని సూచించారు.

Advertisement

Next Story