Accident: ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు- బస్సు ఢీ.. 7 గురు మృతి

by Harish |
Accident: ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు- బస్సు ఢీ.. 7 గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర యాక్సిడెంట్ జరిగింది. కారు-డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెందగా, మరో 25-30 మందికి పైగా గాయపడ్డారు. శని-ఆదివారం అర్థరాత్రి 12:30 గంటల సమయంలో రాయ్‌బరేలీ నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి అదుపుతప్పి ఎక్స్‌ప్రెస్‌వేపై నుంచి కిందికి పడిపోయింది. బస్సు వేగంగా కారును ఢీకొట్టడంతో కారు 20 అడుగుల గుంతలో పడిపోయింది. ప్రమాద సమయంలో దానిలో ఉన్నటువంటి ముగ్గురు కూడా చనిపోయారు.

బస్సులో మొత్తం 60 మంది వరకు ఉన్నారు. వారిలో నలుగురు చనిపోయారు. దాదాపు 25-30 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ వర్మ తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్‌మర్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed