Diarrhoea: మధ్యప్రదేశ్ లో ఏడుగురు మృతి, 150 మందికి అస్వస్థత

by Shamantha N |
Diarrhoea: మధ్యప్రదేశ్ లో ఏడుగురు మృతి, 150 మందికి అస్వస్థత
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) గిరిజన ప్రాబల్యం ఉన్న మండలా జిల్లాలో గత పది రోజుల్లో డయేరియా(Diarrhoea) వల్ల ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 150 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. మండలా(Mandla) జిల్లా అంటువ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ యతీంద్ర ఝరియా మాట్లాడుతూ దేవ్రాహా బహమనీ గ్రామంలో నలుగురు వ్యక్తులు, మాధోపూర్ గ్రామంలో ముగ్గురు చనిపోయారని తెలిపారు. ఆహారం, నీరు కలుషితం కావడం వల్లే చనిపోయినట్లు పేర్కొన్నారు. సుమారు 150 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కొంతమందిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేశామన్నారు. గిరిజన ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతాల్లో అవగాహన కల్పించడంతో పాటు డయేరియాను అదుపులోకి తెచ్చేందుకు ఆరోగ్య బృందాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఉమారియా జిల్లాలో ముగ్గురు మృతి

ఉమారియా(Umaria) జిల్లాలోని రెండు గ్రామాల్లో తండ్రీకొడుకులు సహా ముగ్గురు వ్యక్తులు డయేరియా వల్ల చనిపోయారు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ కేసులు వెలుగులోకి రావడంతో ఏరియా హెల్త్ సూపర్ వైజర్ ని సస్పెండ్ చేశామన్నారు. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత వల్ల డయారియా వ్యాధిని గణనీయంగా నివారించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed