అరగంటలో 5,450 పిడుగులు.. ఎక్కడంటే?

by Sathputhe Rajesh |
అరగంటలో 5,450 పిడుగులు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాలంలో తరచూ పిడుగులు పడతాయనే విషయం తెలిసిందే. పిడుగు పాటుతో జనాలు ప్రాణాలు కోల్పోయిన వార్తలు, జంతువులు చనిపోయిన వార్తలు తరచూ చూస్తుంటాం. అయిత ఒక ప్రాంతంలో ఏకంగా 5,450 పిడుగులు పడటం సంచలనం సృష్టించింది. అది కూడా అరగంట వ్యవధిలో కావడం విశేషం. పిడుగుపాటు శబ్దాలకు భూమి దద్దరిల్లింది. ఒడిశాలోని భద్రక్ జిల్లా బాసుదేవపూర్ లో బుధవారం సాయంత్రం ఆకాశం కన్నెర్ర జేసింది. కేవలం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి. వరుసగా పిడుగులు పడటంతో జనాలు షాక్ కు గురయ్యారు.

ప్రాణ, ఆస్తి నష్టం లేకపోయినప్పటికీ పిడుగు పాటు శబ్దాలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇక ఇలా పిడుగులు ఎందుకు పడ్డాయో అధికారులు తెలిపారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందన్నారు. గోపాల్ పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారి మాట్లాడుతూ.. ఇలా జరగడం మొదటి సారి కాదన్నారు. గతంలో కూడా ఇలా జరిగాయని తెలిపారు. పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక సాంకేతికత రాడార్ తమ కేంద్రానికి ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed