ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మోడీ ఈ రికార్డు సృష్టిస్తారా?

by Shamantha N |
ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మోడీ ఈ రికార్డు సృష్టిస్తారా?
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు దశల్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 543 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మంగళవారం ఫలితాలు రానున్నాయి. అయితే, మరోసారి బీజేపీ గెలిస్తే.. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా.. ఈ సారి మోడీ సర్కారు అధికారంలోకి వస్తే.. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కుతారా లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది.

నెహ్రూ రికార్డు బ్రేక్ అయ్యేనా..!

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ తొలి స్థానంలో ఉన్నారు. 1949 నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాతి నుంచి.. 1952 లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు నెహ్రూ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. దీంతో 16 ఏళ్ల 286 రోజులు ఆయన ప్రధాని హోదాలో సేవలు అందించారు. రెండో స్థానంలో ఇందిరాగాంధీ ఉన్నారు. ఆమె మొత్తం 15 ఏళ్ల 350 రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల 4 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. కాగా.. ఈసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే.. మన్మోహన్ సింగ్ ను దాటేసి మూడో స్థానంలో నిలవనున్నారు. మోడీ 10 ఏళ్ల 8 రోజుల పాటు ప్రధానిగా కొనసాగుతారు. మోడీ మొత్తం 3 టర్ములు ప్రధానిగా కొనసాగినా.. ఇందిరా గాంధీ, నెహ్రూలను అధిగమించలేరు. అయితే, 2029లోనూ బీజేపీ గెలిస్తే మాత్రం.. ఈ రికార్డులు బ్రేక్ కానున్నాయి.

Advertisement

Next Story