- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ నెల 9న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు సంఘాలు రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద నిరసన కూడా చేపట్టారు. బీజేపీ నేతలు అయితే విదేశాల వేదికగా భారత్ పై, సిక్కులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే రాహుల్ తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్ జిల్లాల్లో బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని భారత న్యాయ సంహిత సెక్షన్ 299, సెక్షన్ 302ల ప్రకారం పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు.
Advertisement
Next Story