- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఎన్నికలు మోడీ, రాహుల్ గాంధీ మధ్య జరుగతున్న పోరు- అజిత్ పవార్
దిశ, నేషనల్ బ్యూరో: ఈ లోక్ సభ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీకి రాముల్ గాంధీకి జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. పూణే జిల్లాలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పోటీ చేస్తున్నారు. సునేత్ర తరఫున అజిత్ పవార్ ప్రచారం చేశారు. కన్హేరిలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అజిత్ పవార్, ఆ తర్వాత ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారానికి అజిత్ పవార్ కుమారులు పార్థ్, జై హాజరయ్యారు.
దేశంలో ప్రస్తుతం కీలకంగా మారిని కొన్ని స్థానాల్లో బారామతి ఉంది. ఇది గత కొంత కాలంగా ఎన్సీపీకి కంచుకోటగా ఉంది. అయితే ఎన్సీపీ చీలిక తర్వాత ఈ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్ర పోటీ పడటంతో ఈ స్థానం చర్చనీయాంశంగా మారింది.
ప్రచారంలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. హనుమంతుడిని ప్రార్థించిన తర్వాతే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని.. ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉండబోతున్నాయని అన్నారు. శనివారం.. పవార్ కుటుంబ సభ్యులు అందరూ.. శరద్ పవార్ సాహెబ్ పక్కన కూర్చున్నారని పేర్కొన్నారు. వారు కుటుంబం ఐక్యంగా ఉందని చూపించడానికి ప్రయత్నించారని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు బారమతిలోని అన్ని సంస్థలను శరద్ పవార్ స్థాపించారని పేర్కొన్నారు అని తెలిపారు. అలాంటప్పుడు.. గత 30 ఏళ్లుగా తాను ఏం చేశానని ప్రశ్నించారు అజిత్ పవార్.
ఇకపోతే బారామతి స్థానంలో సుప్రియా సూలేకి ఎన్సీపీ(శరద్ పవార్)-కాంగ్రెస్- శివసేన(ఉద్ధవ్) పార్టీలు మద్దతుగా నిలుస్తుండగా.. సునేత్రకి బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)-శివసేన(షిండే) మద్దతునిస్తున్నాయి. బారామతిలో మే 7న పోలింగ్ జరగబోతోంది.