ప్రధాని మోడీపై పోటీ.. వారణాసి బరిలో ఆ ఆరుగురు

by Shamantha N |
ప్రధాని మోడీపై పోటీ.. వారణాసి బరిలో ఆ ఆరుగురు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఆరుగురు బరిలో నిలిచారు. వారణాసి పార్లమెంటరీ స్థానానికి నామినేషన్ల పరిశీలించింది ఎన్నికల సంఘం. పత్రాల పరిశీలన తర్వాత మొత్తం 15 పత్రాలు ఆమెదించినట్లు తెలిపింది. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో 36 నామినేషన్ పత్రాలు తిరస్కరించినట్లు తెలిపింది ఈసీ.

పత్రాల పరిశీలన తర్వాత 15 నామినేషన్ పత్రాలు ఆమోదించినట్లు తెలిపింది ఈసీ. పలువురు అభ్యర్థులు మూడు, నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

వారణాసి స్థానంలో బీజేపీ నుంచి ప్రధాని మోడీ బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు. బీఎస్పీ నుంచి అతహార్ జమాల్ లారీ, అప్నాదల్ నుంచి గగన్ ప్రకాష్, రాష్ట్రీయ సమాజ్ వాదీ సంక్రాంతి నుంచి పరాస్ నాథ్ సహా ఇద్దరు స్వతంత్రులు సంజయ్ కుమార్ తివారీ, దినేష్ కుమార్ యాదవ్ ఎన్నికల బరిలో నిలిచారు.

ఇకపోతే, మే 17 మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ ఉపసంహరించుకునే అకాశం ఉంది. ఆ తర్వాత ఎంత మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండనున్నారో తేలనుంది.

Advertisement

Next Story