- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతి రోజు ఆన్ లైన్ లో నాటకం.
దిశ వెబ్ డెస్క్: జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. సినిమాల రాకతో నాటకాలు దాదాపు కనుమరుగయ్యాయి. నాటకాభిమానుల, కళా పోషకాలు.. ఇప్పటికీ, ఎప్పటికీ నాటకాలు వేస్తూనే ఉంటారు. ప్రస్తుత కాలంలో ఇప్పుడిప్పుడే నాటకానికి ఆదరణ పెరుగుతోంది. హైదారాబాద్ లోని రవీంద్ర భారతిలో తరుచుగా నాటకాలు జరుగుతుంటాయి.అంతేకాదు నాటకం చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే లాక్ డౌన్ కారణంగా నాటకాలను ఆన్ లైన్ లో చూపిస్తున్నారు.
సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియే నాటకం . యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి . అయితే సినిమాలు, టీవీలు వచ్చాక నాటకాలు మసకబారిపోయాయి. అందుకే.. టీవీ చూస్తూ గడిపేయకుండా నాటకాల వైపు జనాల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ అరవింద్ గౌర్. నాటితో పోల్చుకుంటే.. నాటకాలు చూసేవారి సంఖ్య చాలావరకు తగ్గినా… దానికంటూ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. వారి కోసమే ‘క్వారంటైన్ థియేటర్ ఫెస్టివల్’ని మొదలుపెట్టారు. అస్మితా థియేటర్ గ్రూప్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ వేదికగా తమ నాటకాలను ప్రసారం చేస్తున్నారు. కోర్ట్ మార్షల్, ది లాస్ట్ సెల్యూట్… తదితర రసవత్తర నాటకాలను ఈ పేజీలో చూడొచ్చు. ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు ఓ కొత్త నాటకాన్ని ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేస్తారు. ఈ నాటకాన్ని యూట్యూబ్‌లో కూడా వీక్షించొచ్చు. ‘అమృత్‌సర్ ఆగయా’ నాటకాన్ని తొలి ప్రయోగంగా ఆన్‌లైన్‌లో ప్రదర్శించారు. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా, మరిన్ని మంచి నాటకాలతో అస్మితా గ్రూప్ మన ముందుకు రాబోతున్నది.
Tags: corona virus, lockdown, natakam, facebook, online