‘ఆస్ట్రోనాట్స్‌’ను అవాక్కయేలా చేయనున్న Tide

by Shyam |
Astronates-tide
X

దిశ, ఫీచర్స్ : అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తమ బట్టలు వాష్ చేసుకునేందుకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాసా.. ప్రముఖ డిటర్జెంట్ టైబ్ మేకర్ ‘ప్రోక్టర్ అండ్ గ్యాంబిల్(P&G)’తో జతకట్టింది. నిజానికి స్పేస్‌లో ఉండే ఆస్ట్రోనాట్లు తమ దుస్తులను శుభ్రం చేసుకోరు. అవి పూర్తిగా మురికిగా అయ్యేవరకు ధరించి ఆ తర్వాత వాటిని చెత్త బ్యాగుల్లో నింపి కాల్చేస్తారు. దీనివల్ల టన్నుల కొద్దీ బట్టలు వృథా అవుతుండగా.. నాసా ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకుంటోంది. ఈ క్రమంలోనే వ్యోమగాముల దుస్తులను శుభ్రం చేసి, రీయూజ్ చేసేందుకు గల మార్గాలను అన్వేషించేందుకు ‘టైడ్’ కంపెనీతో టైఅప్ అయింది.

ఈ నేపథ్యంలో స్టెయిన్ రిమూవల్ ఎక్స్‌పరిమెంట్స్‌ చేపట్టేందుకు 2022లోగా స్పేస్ స్టేషన్‌కు జత టైడ్ డిటర్జెంట్‌ను పంపిస్తామని తాజాగా ప్రకటించింది. మొదటి ప్రయోగంలో భాగంగా P&G కంపెనీ.. డిసెంబర్‌లో కస్టమ్ మేడ్ డిటర్జెంట్‌ను అంతరిక్షానికి పంపనుంది. అక్కడ ఉండే వెయిట్‌లెస్‌నెస్ కారణంగా ఆరు నెలల తర్వాత అందులోని ఎంజైములు, ఇతర పదార్థాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో సైంటిస్టులు తెలుసుకోనున్నారు. ఇక వచ్చే మే నెలలో ఆస్ట్రోనాట్స్ టెస్ట్ చేసేందుకు గాను స్టెయిన్ రిమూవల్ పెన్స్, వైప్స్ పంపించనుంది. ఇదే సమయంలో చంద్రుడితో పాటు అంగారకుడిపైనా తక్కువ పరిమాణంలో నీరు, డిటర్జెంట్‌‌తో ఆపరేట్ చేసేందుకు వీలుండే ‘వాషర్ – డ్రైయర్’ కాంబోను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కాగా ఆస్ట్రోనాట్స్‌కు ఏడాదికి 68 కిలోల బట్టలు అవసరమవుతాయి. అయితే మూడు సంవత్సరాల మార్స్ మిషన్‌లో ఆ సంఖ్య పెరుగుతుందని P&G ఫ్యాబ్రిక్ అండ్ హోమ్ కేర్ టెక్నాలజీలో కెమిస్ట్ స్పెషలైజింగ్ ఆఫీసర్ మార్క్ సివిక్ వెల్లడించారు. అయితే ఇలా స్పేస్‌లో లాండ్రీ ప్రాసెస్ నిర్వహించేందుకు నాసా ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ స్పేస్ ఏజెన్సీ, ఇతర స్పేస్ స్టేషన్ పార్టనర్స్ కలిసి ప్రత్యేక యాంటీమైక్రోబయాల్ దుస్తులు ఉపయోగించడాన్ని పరిశీలించారు. అయితే అది దీర్ఘకాలిక పరిష్కారంగా కనిపించలేదు.

Advertisement

Next Story