చేనేతలకు 365 రోజులు పని కల్పిస్తాం

by Anil Sikha |
చేనేతలకు 365 రోజులు పని కల్పిస్తాం
X

దిశ, ఏపీ బ్యూరో : నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ కల్యాణమండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను ఇవాళ ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం చేనేత వస్త్రాలు, హ్యాండీ క్రాఫ్ట్ స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, అబద్ధయ్య, పలువురు డైరెక్టర్లు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆప్కో జీఎం రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story