- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేంద్రం సంచలన నిర్ణయం.. పార్లమెంట్‌లో ఆ సినిమా ప్రదర్శన

దిశ, వెబ్‌డెస్క్: విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్నా(Rashmika Mandanna) కాంబినేషన్‌లో వచ్చిన ఛావా మూవీ(Chhaava Movie) సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ లాంగ్వేజ్.. ఆ లాంగ్వేజ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ అదరగొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.700 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది. ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) కుమారుడైన.. శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పార్లమెంట్‌లో ఛావా సినిమాను ప్రదర్శించాలని భావిస్తోంది. దేశంలోని ఎంపీలంతా చూడాల్సిన సినిమా అని.. వచ్చే గురువారం(27-03-2025) రోజున ఎంపీలంతా రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విపక్ష పార్టీల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు సినిమా ప్రదర్శన రోజు వస్తారా? రారా? అనే సందిగ్ధత నెలకొంది.
2025 ఫిబ్రవరి 14న విడుదలైన సూపర్ హిట్ సినిమాను రీసెంట్‌గా తెలుగులో కూడా విడుదల చేయగా.. భారీ వసుళ్లను సాధించింది. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్ నిర్మించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. సుమారు నెల రోజుల తర్వాతే ఓటీటీ(OTT)లోకి ఈ మూవీని తీసుకుని రావాలని ముందుగానే డీల్ జరిగిందట. అయితే ఇటీవల ఛావా మూవీ(Chhaava Movie) ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. కొందరు ఈ మూవీని పైరసీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.