Delhi Budget: మీరు శీష్ మహల్ నిర్మిస్తే.. మేం పేదలకు ఇళ్లు నిర్మిస్తాం- ఢిల్లీ సీఎం

by Shamantha N |
Delhi Budget: మీరు శీష్ మహల్ నిర్మిస్తే.. మేం పేదలకు ఇళ్లు నిర్మిస్తాం- ఢిల్లీ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీఎం రేఖా గుప్తా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget) కంటే ఈ బడ్జెట్ 31.5 శాతం అధికం. కాగా.. ఢిల్లీ గత ప్రభుత్వంపై రేఖా గుప్తా దుమ్మెత్తి పోశారు. కేజ్రీవాల్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం మాట్లాడుతూ..”ఢిల్లీ మాలిక్ దేశరాజధానిని లండన్ గా మారుస్తాని హామీ ఇచ్చారు. దానికి బదులుగా ట్రాఫిక్ జాంలు, అంపూర్ణ ప్రాజెక్టులు ఇచ్చారు. మా మధ్య చాలా తేడా ఉంది. మీరు వాగ్దానాలు చేశారు. మేం వాటిని నెరవేరుస్తాం. మీరు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను దుర్వినియోగం చేశారు. మేం కలిసి ఐకమత్యంగా పనిచేస్తాం. మీరు 'శీష్ మహల్' నిర్మించారు. మేం పేదలకు ఇళ్లను నిర్మిస్తాం. మీరు లక్షల విలువైన (గోల్డెన్) టాయిలెట్లను ఏర్పాటు చేశాం. మేం పేదలకు టాయిలెట్లను నిర్మిస్తాము." అని అన్నారు. ఢిల్లీని 'పర్యాటక కేంద్రం'గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా శీష్ మహల్ ను సర్క్యూట్ లో చేర్చుతామన్నారు. ప్రజలను ఆ భవనాన్ని చూపించేందుకు టికెట్లను అమ్ముతామని విమర్శించారు.

.ఢిల్లీ బడ్జెట్‌లోని కీలక ప్రకటనలు

మూలధన వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. గత బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ. 15 వేల కోట్లుగా ఉండగా, ఈ బడ్జెట్‌లో దానిని రూ. 28 వేల కోట్లకు పెంచారు. ప్రజలకు ఇకపై రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందుతుందని ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కోసం బడ్జెట్‌లో రూ.5,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే ఢిల్లీలోని ప్రతి మహిళకు ప్రతీనెల రూ. 2,500 ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ జన ఆరోగ్య యోజనకు అదనంగా మరో రూ. ఐదు లక్షలు జత చేస్తుంది. అంటే రూ. 10 లక్షల కవర్ అందుతుంది. ఈ పథకానికి రూ. 2,144 కోట్లు కేటాయించారు. మహిళా సమృద్ధి యోజనకు రూ.5,100 కోట్లు కేటాయించారు. ప్రసూతి వందన పథకానికి రూ.210 కోట్లు.. నీరు, విద్యుత్, రోడ్లు అభివృద్ధికి ప్రణాళికలు.. ఢిల్లీ రోడ్డు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఎన్‌సీఆర్‌తో అనుసంధానం కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. మహిళల భద్రత కోసం అదనంగా 50 వేల సీసీటీవీల ఏర్పాటు చేయనున్నారు. జేజే కాలనీ అభివృద్ధికి రూ.696 కోట్లు కేటాయించగా... ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకానికి రూ.20 కోట్లు కేటాయించారు. 100 చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్ల బడ్జెట్ నిధులు ఇచ్చారు. అంతేకాకుండా, ఢిల్లీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంతో పాటు గిడ్డంగి విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి, వ్యాపారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయడం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం ప్రకటించారు.

Advertisement
Next Story

Most Viewed