- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన యాప్స్ గుర్తింపు

దిశ, డైనమిక్ బ్యూరో: బెట్టింగ్ యాప్స్ (betting apps) ప్రమోషన్ కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇక వేలాది మంది యువత జీవితాలలో చీకటి నింపుతున్న బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ కేసును పోలీసులు మరింత స్పీడప్ చేశారు. మంగళవారం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్‌ను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. జంగిల్ రమ్మి యాప్ కోసం రానా, ప్రకాష్‌రాజ్, ఏ23 యాప్ కోసం విజయ్‌దేవరకొండ, యోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ కోసం హీరోయిన్ ప్రణీత, జీట్‌విన్ యాప్ కోసం నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్ కోసం శ్యామల.. హర్షసాయి, విష్ణుప్రియ, రీతుచౌదరి, టేస్టీ తేజ, బయ్య సన్నీలు పలు యాప్స్‌కు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
తాజాగా 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. వీరిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలిసింది. కాగా, మొదట బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, బుల్లితెర నటులపైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రణీత, నేహా శర్మ, ప్రకాష్‌రాజ్ ఇలా టాలీవుడ్ సెలబ్రిటీల పైన కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండైల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ లపై కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు కేసు నమోదైంది. అర్జున్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.