CM ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవటమే ఆ ఎంపీ పని.. ఆయనకు కూడా భయపడతామా?

by Gantepaka Srikanth |
CM ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవటమే ఆ ఎంపీ పని.. ఆయనకు కూడా భయపడతామా?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt), నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(Lavu Krishna Devarayalu)పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు అని అన్నారు. ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి అని హితవు పలికారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే భారీ లిక్కర్ కుంభకోణం జరిగింది.. లిక్కర్ వ్యాపారులను బెదిరించి కమీషన్లు దండుకున్నారని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవటమే ఎంపీ లావు పని అని.. ఆయనకు కూడా భయపడతామా? అని ప్రశ్నించారు. జగన్‌(Jagan)పై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదు అని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) హయాంలో రాష్ట్రంలో భారీ లిక్కర్ కుంభకోణం జరిగిందని నిన్న పార్లమెంట్‌లో లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘జగన్(Jagan) హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగింది. జగన్ బంధువు సునీల్ రెడ్డి(Sunil Reddy) ద్వారా దుబాయ్‌కి రూ. 2 వేల కోట్ల విలువైన మద్యం, డబ్బులు తరలించారు. ఈ విషయాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు.’ అని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ.. ఎంపీ లావుకు కౌంటర్లు ఇస్తున్నారు.



Next Story

Most Viewed