ఆకాశంలోకి బెలూన్‌ను పంపనున్న నాసా

by Harish |
ఆకాశంలోకి బెలూన్‌ను పంపనున్న నాసా
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’.. ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఏకంగా ఫుట్‌బాల్ మైదానం సైజులో ఉండే ఓ బెలూన్‌ను స్ట్రాటోస్పియర్‌లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బెలూన్‌లో 8.4 అడుగుల పొడవైన టెలీస్కోప్‌ను అమర్చి స్ట్రాటో ఆవరణంలోకి పంపబోతుండగా.. దీనికి ‘ఆస్ట్రోస్’ (asthros – Astrophysics Stratospheric Telescope for High Spectral Resolution Observations at Submillimeter-wavelengths) అని పేరు పెట్టింది. ఈ టెలీస్కోప్‌ను ఉపయోగించి లైట్ వేవ్‌లెంగ్త్ ( కాంతి తరంగధైర్ఘ్యాలను)ను కనుక్కునేందుకు ‘నాసా’ ప్రయత్నిస్తోంది. ఇక, స్పేస్ మిషన్‌తో పోల్చి చూస్తే.. ఆస్ట్రోస్ లాంటి మిషన్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని జేపీఎల్ ఇంజనీర్ జోస్ సైల్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

ఆస్ట్రోస్‌‌ను ఆకాశంలోకి పంపడం కోసం ఉపయోగించే భారీ బెలూన్‌‌ను గాలితో నింపినప్పుడు.. 400 అడుగుల వెడల్పుతో ఫుట్‌బాల్ మైదానమంత ఉంటుందట. ఇది ఆకాశంలో 1,30,000 అడుగుల ఎత్తుకు చేరుతుందని (40 కిలోమీటర్లు) నాసా పరిశోధకులు తెలిపారు. ఇక్కడి నుంచి ఆస్ట్రోస్ సాయంతో కాంతి వేవ్‌లెంగ్త్‌లను పరిశోధిస్తారని సమాచారం. సూదూరంలో ఉన్న ఇనఫ్రారెడ్ లైట్‌ను స్టడీ చేయాలంటే అస్ట్రోస్ కనీసం 40 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లాల్సి ఉంటుంది. మన భాషలో చెప్పుకోవాలంటే.. కమర్షియల్ ఫ్లైట్స్ ఎగిరే ఎత్తు కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఇంతవరకు ఎవరూ స్డడీ చేయని ఆస్ట్రో ఫిజిక్స్ ఆబ్జర్వేషన్స్‌ను ఆస్ట్రోస్ ద్వారా చేయాలనుకుంటున్నామని నాసా వెల్లడించింది. ఈ ప్రయోగం.. ముందు తరాల ఇంజనీర్స్, సైంటిస్ట్‌లకు ఎంతో ఉపయోగపడుతుందని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed