- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తాడేపల్లి కొంపలో పడుకున్న జగన్ మేల్కోండి’
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ‘ఎవరెలా చస్తే నాకేంటి తాడేపల్లి కొంపలో నేను హాయిగా నిద్రపోతే చాలు అన్నట్టుగా’ సీఎం జగన్ రెడ్డి వ్యవహారశైలి ఉందని విమర్శించారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దేశమంతా అలర్ట్‌గా ఉంటే జగన్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశాయని చెప్పుకొచ్చారు.
మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 18 ఏళ్ళు పైబడిన వారికి ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి వేసి దేశంలోనే అట్టడుగుస్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. కుల పిచ్చితో వ్యాక్సిన్ కంపెనీపై ఏడ్చే బదులు.. వచ్చిన వ్యాక్సిన్ వృథా కాకుండా వేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని లోకేశ్ ట్విటర్ వేదికగా విమర్శించారు. మాస్కుతో ముఖం తుడుచుకొని, తాడేపల్లి కొంపలో ముడుచుకొని పడుకున్న జగన్ రెడ్డి నిద్రలేవండి. థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే హెచ్చరికలపై మేల్కొనండి అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.