- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవో తెచ్చి మీడియా గొంతు నొక్కారు :లోకేష్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. చేసిందే చట్టం, ఇచ్చేదే జీవోగా జగన్ సర్కారు వ్యవహరిస్తోంది. జీఓ నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు. జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ పీకేశారని మండిపడ్డారు.
అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతల్లోకెల్లా వింత. టిడిపి హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లలో 10 శాతం కూడా ఇవ్వడంలేదు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడిటేషన్లు ఇచ్చి మిగిలిన జర్నలిస్టులందరి మొండిచేయి చూపడం చాలా దారుణం. అక్రిడిటేషన్ జర్నలిస్టుల హక్కు. పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
చేసిందే చట్టం, ఇచ్చేదే జీవోగా @ysjagan సర్కారు వ్యవహరిస్తోంది. జీఓ నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు. జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ పీకేశారు.(1/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021