- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏ2 అల్లుడికి కట్నం రూ.856 కోట్ల ప్రజాధనం: నారా లోకేశ్
దిశ, ఏపీ బ్యూరో: ఏ2 అల్లుడికి కట్నంగా రూ.856 కోట్ల ప్రజాధనం ఇస్తున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆపదలో ఆదుకునే అంబులెన్స్‌లను కూడా వైఎస్సార్సీపీ నేతలు అవినీతికి అడ్డాగా మార్చుకున్నారని విమర్శించారు. ఎవరైనా తమ అల్లుడికి ఆస్తిని కట్నంగా ఇస్తారన్న ఆయన, ఏ2 మాత్రం 108 అంబులెన్స్ కాంట్రాక్టు ద్వారా కొట్టేస్తున్న రూ.856 కోట్ల ప్రజాధనాన్ని కట్నంగా ఇస్తున్నారని ఆరోపించారు. ఏ2 గారిది అవినీతికి బాగా అలవాటైన ప్రాణం అని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్కో అంబులెన్స్‌కు రూ.1.31 లక్షల చొప్పున ఐదేళ్లకు తీసుకున్న కాంట్రాక్టును రద్దు చేసి అల్లుడి కంపెనీకి రూ.2.21 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఐదేళ్లలో రూ.856 కోట్లు దోచిపెడుతున్నారని వివరించారు. ఇందులో ఏ1 వాటా ఎంతో? అంటూ నారా లోకేశ్ సందేహం వ్యక్తం చేశారు.