- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, స్పోర్ట్స్ : అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి నయోమీ ఒసాకా మద్దతు తెలిపింది. అమెరికాలో నల్లజాతీయులపై కాల్పులు జరపడంతో అక్కడ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనపై బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, సాకర్ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేశారు.
వారి బాటలోనే ఒసాకా నడిచింది. ప్రస్తుతం జరుగుతున్న సిన్సినాటీ మాస్టర్స్ టోర్నీలో ఆమె క్వార్టర్ ఫైనల్‌లో గెలుపొందింది. గురువారం ఆమె సెమీస్ ఆడాల్సి ఉంది. కానీ అర్థాంతరంగా ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో ఆ టోర్నీని ఒక రోజు పూర్తిగా నిలిపేశారు. తాను వైదొలగడానికి కారణాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.
‘హలో.. మీలో చాలా మందికి గురువారం నా సెమీఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ గురించి తెలిసే ఉంటుంది. అయితే అథ్లెట్‌గా పుట్టడాని కంటే ముందు నేనో నల్లజాతి మహిళను. నేను టెన్నిస్ ఆడటం కన్నా ఓ నల్లజాతి మహిళగా దృష్టి సారించిన అంశాలు చాలా ఉన్నాయి. నేను ఆడకపోవడం వల్ల ఇప్పుడు వచ్చే నష్టం ఏంలేదనుకుంటున్నా. వరుసగా నల్లజాతీయులను పోలీసులు కాల్చి చంపడం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఇలా వరుస ఘటనలతో రోజుల వ్యవధిలోనే కొత్త హ్యాష్ ట్యాగ్‌లు పాపప్ అవ్వడంతో విసిగిపోయాను. పదే పదే దీనిపై మాట్లాడటం కూడా నాకు చిరాకు తెప్పిస్తుంది. దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారో..?’అని ఓసాక తన పోస్టు ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఒసాకా నిర్ణయాన్ని మాజీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ సమర్థించాడు.