- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నమస్తే తెలంగాణకు ఈటల ఎఫెక్ట్.. పేపర్లు దగ్ధం
దిశ, చెన్నూర్: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ సొంత పత్రికగా పేరు పొందిన నమస్తే తెలంగాణకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎఫెక్ట్ తగలింది. నమస్తే తెలంగాణలో ఈటలకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన దగ్గర నుంచి ఆయన అభిమానులు కేసీఆర్‌పై మండిపడుతున్నారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలు దగ్ధం చేశారు. ఈ క్రమంలో తాజాగా నమస్తే తెలంగాణ దినపత్రికకు ఈటల మద్దతురాలు షాక్ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతులను ఈటల మద్దతుదారులు దగ్ధం చేశారు. చెన్నూర్ మండలంలోని రాయిపేట గ్రామంలో నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను ఈటల రాజేందర్ మద్దతుదారులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ఫోటోలను మార్పింగ్ చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్న సందర్భంగా నమస్తే తెలంగాణ పత్రికను దగ్ధం చేసినట్లు తెలిపారు. ఇలాగే పిచ్చి రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.