మాతో రెండు హృదయాలు జతకలిశాయి : నమ్రత

by Shyam |
మాతో రెండు హృదయాలు జతకలిశాయి : నమ్రత
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ హీరోయిజాన్ని తలపించే పనులు చేస్తుంటాడు. కొన్నాళ్లుగా మహేశ్.. గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు తనవంతుగా సాయమందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చిన్నారులకు మహేశ్ బాబు గుండె ఆపరేషన్ చేయించారు. ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి మహేశ్ బాబు ఈ మహా కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ జరగగా, వారు క్షేమంగా ఉన్నారని మహేశ్ సతీమణి నమ్రతా శిరోధ్కర్ ఇన్‌స్టా వేదికగా తెలిపారు.

‘మరో రెండు గుండెలు మా కుంటుంబంతో కలిశాయి. దాంతో మా కుటుంబం మరింత పెద్దది అయ్యింది. ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం బాగుంది. ఇటీవలే డిశ్చార్జి కూడా అయ్యారు. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ మంచి పనిలో, ఇంత టఫ్ సిట్యువేషన్‌లోనూ మాకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు’ అంనమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed