ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి: ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి

by Shyam |
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి: ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వలస కూలీల విషయంలో ప్రభుత్వ మాటలకు ఆచరణకు పొంతన లేదన్నారు. బత్తాయి, నిమ్మ ఎగుమతుల్లో ఆటంకాలు లేకుండా చూడాలని, లాక్‌డౌన్‌తో బత్తాయి ఢిల్లీకి ఎగుమతి కావట్లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే రూ. 200 కోట్లు వెచ్చించి బత్తాయిని కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ఇస్తామన్న 12 కిలోల బియ్యం, రూ.1500 ఇంకా పేదలకు చేరలేదని ఆరోపించారు. 12 కిలోల బియ్యంలో కేంద్రం ఇచ్చిన 5 కిలోల బియ్యం కూడా ఉన్నాయా? లేదా అన్నది సీఎం స్పష్టం చేయాలని కోరారు. కేంద్రం ఇస్తామన్న పప్పు, గ్యాస్ ఇంకా రాలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, వంగూరి లక్ష్మయ్య, మనీ మద్దే సుమన్, గుమ్ముల మోహన్ రెడ్డి, బొంత వెంకటయ్య, జిల్లపల్లి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Nalgonda Mp,Uttam Kumar reddy,Field Assistant,press meet

Advertisement

Next Story