- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా నాగార్జునసాగర్ జెన్ కో ఉద్యోగుల నిరసన..
దిశ, నాగార్జునసాగర్: కేంద్ర ప్రభుత్వం శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రైవేటు వ్యక్తుల లాభార్జన ధ్యేయంగా విద్యుత్ సంస్థలను, సహజ వనరులను ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో సవరణ బిల్లును చట్టం గా మార్చాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.
దీని వల్ల దేశ వ్యాప్తంగా సమస్త ప్రజానీకం, రైతాంగం, విద్యుత్ ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఒంటెద్దు పోకడ విధానాన్ని, మొండి వైఖరిని విరమించుకోకపోతే వర్క్ బై కాట్, మెరుపు సమ్మె లాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వెనకాడబోమని ఉద్యోగులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు సందీప్ రెడ్డి, వంశీ కృష్ణ, వరప్రసాద్, సులక్ష్మి, రామకృష్ణ, రాజు, కృష్ణ ప్రసాద్, మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్, సాంబశివ రావు, శ్రీను, నాగరాజు, తదితరులు JAC తరపున పాల్గొన్నారు.