కేసీఆర్‌ను కలిసిన నోముల భగత్

by Shyam |   ( Updated:2021-05-10 07:06:49.0  )
కేసీఆర్‌ను కలిసిన నోముల భగత్
X

దిశ, నాగార్జునసాగర్: ఇటీవల నాగార్జున సాగర్ ఉపఎన్నికలో విజయం సాధించిన నోముల భగత్‌.. తాజాగా సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. నోముల భగత్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సీఎం కేసీఆర్‌ భగత్‌కు సూచించారు. నోముల భగత్ వెంట ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్‌, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సోమా భరత్ కుమార్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story