అక్కినేని అభిమానులకు చైతన్య, సామ్ గుడ్ న్యూస్ ?

by Anukaran |   ( Updated:2021-09-30 22:49:58.0  )
అక్కినేని అభిమానులకు చైతన్య, సామ్ గుడ్ న్యూస్ ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే గుర్తుకు వచ్చే పేరు నాగచైతన్య సమంత. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక విషయంపై అక్కినేని కొడుకు, కోడలు స్పందించకపోవడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి అక్కినేని అనే పేరును తొలిగించి ఎస్ అనే అక్షరం జోడించడంతో ఈ విడాకుల విషయంలో వస్తున్న గుసగులకు మరింత ఆజ్యం పోసినట్టైంది. అప్పటి నుంచి సమంత నాగచైతన్యలు విడాకుల విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఈ వార్తలలో నిజం లేదు అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి చైతన్య , సామ్ వారి సక్సస్‌ను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. లవ్ స్టోరి సినిమా సక్సెస్, నాగ చైతన్య సాకీ సక్సస్ ను సమంత ఎంజాయి చేస్తూ గడుపుతున్నారు.

విడాకుల విషయంపై వీరు స్పందించక పోవడంతో వినిపిస్తున్న గుసగుసలు నిజమే అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ, వీరు దీనిపైన డైరెక్ట్‌‌గా స్పందించకపోయిన వారు తీసుకుంటున్న స్టెప్స్ చూస్తే మాత్రం వినిపించే వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సామ్‌‌కి ఓ అభిమాని నుంచి సామ్‌ మీరు ముంబైకి షిప్ట్‌ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపైన సమంత స్పందిస్తూ.. ఇలాంటి రూమార్స్‌ అన్ని ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు.. అన్ని రూమర్స్ లాగే ఇదో రూమర్ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నాగచైతన్య కూడా తనపై రూమర్స్ వస్తున్నాయని, ఆ రూమర్స్ చూసి బాధపడే వాడిని కానీ ఇప్పుడు ఓ వార్త ఇంకో వార్తను క్షణాల్లో రిప్లేస్ చేస్తుందని, నిజం మాత్రం ఎప్పటికి అలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఎలాంటి గొడువలు జరగలేదని, వారి వారి పనుల్లో బీజీ ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే వీరి పెళ్లి రోజు వీరు జంటగా కలసి వచ్చి అక్కినేని అభిమానులకు సప్రైజ్ ఇస్తారని కొందరు అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇదిలా ఉంటే సమంత, చైతూ డైవర్స్ మ్యాటర్‌లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. డైవర్స్ వార్తలు నిజం కాదని, వీరు తమ ఫ్యామిలీని పెంచుకునే పనిలో ఉన్నారని ఓ వార్త బయటకు వచ్చింది. చైతన్య, సమంత బేబీ(పిల్లలు కనేందు)కి ప్లాన్‌ చేస్తున్నారట. అందుకోసమే సమంత వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుందని, అందులో భాగంగానే కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదని, కొత్తగా మరే స్క్రిప్ట్ కూడా వినడం లేదని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ కొత్త ట్విస్ట్ మరింత వైరల్‌గా మారింది. వస్తున్న ఈ రూమర్స్‌లో ఏది నిజం.. ఏది అబద్ధం అని తెలియాలంటే ఇక వీరి పెళ్లి రోజు వరకు వేయిట్ చేయాలి. ఇక ఆరోజు విడాకులపై వస్తున్న రూమర్స్ పై చైతన్య సామ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరీ.

Advertisement

Next Story

Most Viewed