మహేశ్‌ అభిమానసంఘ అధ్యక్షుడిగా ‘నాగచైతన్య’

by Anukaran |   ( Updated:2021-01-06 08:44:45.0  )
మహేశ్‌ అభిమానసంఘ అధ్యక్షుడిగా ‘నాగచైతన్య’
X

దిశ, వెబ్‌డెస్క్ : శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమాతో అక్కినేని నాగచైతన్య కంప్లీట్ యాక్టర్ అనిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్‌లో తన ఎక్స్‌ప్రెషన్స్‌ కెరియర్‌లోనే బెస్ట్‌ కాగా.. తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు చైతు. ఇంత పాజిటివ్ టైమ్ నడుస్తుండగా.. చైతు తన నెక్స్ట్ సినిమాలో మరో హీరో అభిమాన సంఘ అధ్యక్షుడిగా కనిపించేందుకు ఓకే చెప్పాడట. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘థాంక్యూ’ చిత్రంలో మహేశ్ వీరాభిమానిగా కనిపించనున్నాడట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ, అవికా గోర్ హీరోయిన్లు కాగా.. బీవీఎస్ రవి కథను అందించారు.

Advertisement

Next Story