- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వందల తరాలకు ‘బాలు ఒక్కడే’ : నాగబాబు
దిశ, వెబ్‌డెస్క్ :
ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కరోనాతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి ఆయన కరోనాను జయించారు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ చానల్ ద్వారా తెలియజేసిన నాగబాబు.. బాలు గురించి ప్రత్యేకంగా ఓ వీడియో చేశాడు. బాలు లాంటి మహానుభావుడు మళ్లీ పుట్టడని చెప్పిన నాగబాబు.. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
‘మహానుభావుడు, గానగంధర్వుడు, మన తెలుగువాడు.. ఒక అమోఘమైన గాయకుడు బాలు గారు ఇక లేరు. టీవీ పెట్టినా, వేడుకలకు, దేశ విదేశాలకు వెళ్లినా.. ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. ఆయన గొంతు వినిపించని చోటంటూ లేదు. అందుకే ఆ గొంతును మనం మిస్ కాలేము. బాలును ఇంకెవరితోనూ కంపేర్ చేయలేం. ఘంటసాల, ముఖేష్, మహ్మద్ రఫీ వీరందరికీ వారి వారి ప్రత్యేకతలున్నాయి. కానీ అన్ని భాషల్లో, అన్ని రకాల ఎమోషన్స్‌తో పాడటం మాత్రం ప్రపంచంలో బాలుకు మాత్రమే సాధ్యం. కోట్లాది మందిలో.. వందల తరాల్లో.. బాలు లాంటి వాళ్లు ఒక్కరే పుడతారు. సుఖ దు:ఖాలు సినిమాలో బాలు పాడిన ‘మేడంటే మేడ కాదు.. గూడంటే గూడు కాదు’ అనే పాటను ఇప్పటికీ నేను మరిచిపోలేను. బాలు ఏదైనా సినిమాలో ఓ పాట పాడితే.. ఆ నిర్మాతకు, చిత్రయూనిట్‌కు కూడా గర్వకారణం. అలా నా తొలి సినిమా ‘రుద్రవీణ’లోని ‘నేను సైతం’ పాటకు బాలు గారికి నేషనల్ అవార్డు రావడం నాకో మంచి జ్ఞాపకం. ఓన్లీ వన్ బాల సుబ్రహ్మణ్యం అంతే!’ అంటూ నాగబాబు బాలు జ్ఞాపకాలను పంచుకున్నాడు.