- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియా ఏం చేయాలో కూడా వైసీపీనే చెప్పడం వారి నియంతృత్వానికి నిదర్శనం..
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. అయితే ఈ పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ పాదయాత్ర కొనసాగుతుంది. పోలీసుల ఆంక్షలపై జనసేన పార్టీ స్పందించింది.
రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రను కవర్ చేసేందుకు వెళ్తున్న మీడియాను పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇలా అడ్డుకోవడం అంటే మీడియా స్వేచ్ఛను హరించడమేనని చెప్పుకొచ్చారు. పాదయాత్రకు సంబంధించి విజువల్స్, వార్తలు సేకరించాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీడియా ఏం చేయాలో కూడా వైసీపీ ప్రభుత్వమే చెప్తూ.. పాత్రికేయులను నియంత్రించడం ఖచ్చితంగా నియంతృత్వ పోకడేనని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు.