నా ఎడమ భుజం రాలిపోయింది : కె. విశ్వనాథ్

by Anukaran |
నా ఎడమ భుజం రాలిపోయింది : కె. విశ్వనాథ్
X

దిశ, వెబ్‌డెస్క్ : పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మరణంపై సీనియర్ దర్శకుడు, నటుడు కె. విశ్వనాథ్ స్పందించారు. సిరివెన్నెల లేడంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. సీతారామ శాస్త్రీ మరణంతో ‘నాకు తీరని నష్టం కలిగిందని.. నా ఎడమ భుజం రాలిపోయిందని’ వ్యాఖ్యానించారు. కాగా, అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాటల పూదోట సిరివెన్నెల మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా, దర్శకుడిగా కె.విశ్వనాథ్ తెరకెక్కించిన చాలా సినిమాలకు సిరివెన్నెల సీతారామ శాస్త్రే పాటల రచయిత కావడం గమనార్హం. ఆయన ప్రస్థానం ఇప్పటిది కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని వేల పాటలు రాసిన ఘనత ఒక్క సిరివెన్నెలకే దక్కుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Advertisement

Next Story