తల్లితో అక్రమ సంబంధం.. అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన వ్యక్తి.. నడిరోడ్డుపై రక్తపు మడుగులో..!

by Anukaran |   ( Updated:2021-12-03 07:52:02.0  )
తల్లితో అక్రమ సంబంధం.. అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన వ్యక్తి.. నడిరోడ్డుపై రక్తపు మడుగులో..!
X

దిశ, దండేపల్లి : సమాజంలో వివాహేతర సంబంధాలు రాను రాను ఎక్కువ అవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న అక్రమ సంబంధాలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఏకంగా దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి రాగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

వివరాల్లోకివెళితే.. జిల్లాలోని దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన ప్రవీణ్ (35) అనే వ్యక్తి అదే గ్రామంలో ఉంటున్న ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఆ విషయం కాస్త ఆ మహిళ కొడుకు పవన్ కళ్యాణ్‌కు తెలిసిపోయింది. ఇలాంటివి మానుకోవాలని తల్లితో పాటు ప్రవీణ్‌ను కూడా పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ప్రవీణ్ ఆమె ఇంటికి వెళ్లి తన బిజీలో తాను ఉండగా.. అదే టైంకు మహిళ కొడుకు పవన్ కళ్యాణ్ వచ్చాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఆ ఇంటి నుంచి పారిపోతుండగా వెంబడించిన పవన్ కళ్యాణ్ అతని తలపై బలంగా కొట్టాడు. దీంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పెరుమాల్, లక్షెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

Next Story