- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంచివున్న ముప్పు.. బురదమయమైన కాలనీలు (వీడియో)
దిశ, పెద్డపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు శ్రీరాంనగర్‌కు చెందిన నాయి బ్రాహ్మణ వీధిలో మున్సిపల్ నీటి పైపులు లీక్ అయ్యి కాలనీలోని రోడ్డు జలమయమైంది. దీంతో కాలనీలోని ఇండ్ల ముందు భారీగా వరదనీరు చేరి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యపై కాలనీ వాసులు పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నీటి లీకేజీ మూలగాగి, ఇండ్ల ఎదుట బురదమయమై కాలనీలో ఎలాంటి భకార్యాలు చేసుకోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. నిలిచిన బురదనీటిలో దోమలు ఎక్కువై పిల్లలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే విష జ్వారాల బారినపడ్డ తమ పిల్లల పూర్తి బాధ్యత మున్సిపల్ పాలకులు, అధికారులే వహించాలని హెచ్చరించారు.