- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిస్సెస్ ఇండియా లక్ష్మీరావ్‌కు వేధింపులు
దిశ, క్రైమ్ బ్యూరో: ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్న వారి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ 2016 మిస్సెస్ ఇండియా లక్ష్మీరావ్ సోమవారం సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నల్లగండ్లలోని మంజీర డైమండ్స్ టవర్స్‌లోని ఎల్-806 ఫ్లాట్‌లో లక్ష్మీరావ్ భర్త, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. అదే అపార్ట్మెంట్‌లో ప్రెసిడెంట్, సెక్రెటరీలుగా ఉన్న అతుల్ సింగ్, శ్రీజిత్ కెరల్, సిద్దార్ధ అనే ముగ్గురు వేర్వేరు పాట్స్‌లో నివసిస్తున్నారు. అయితే వీరు లక్ష్మీరావును గత ఆరు నెలలుగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. ఇటీవల వేధింపులు మరింత తీవ్రతరం కావడంతో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది. అంతేగాకుండా, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు వదంతులు సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… వ్యాపారరీత్యా నేను స్వతహాగా ఎదుగుతున్నందుకు ఓర్వలేక వారు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపింది. ఆవాజ్ అనే సంస్థ ద్వారా యాంటీ సూసైడ్ క్యాంపెయిన్ రన్ చేసిన నాపై సూసైడ్ చేసుకున్నట్టు ఎందుకు వదంతులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో నా ఆడి కారును డ్యామేజ్ చేసి రూ.6 లక్షల నష్టం కలిగించారని.. ఇప్పుడు ఆత్మహత్య పుకార్లపై ఏం చేస్తారో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫిర్యాదు పట్ల కమిషనర్ సజ్జనార్ సానుకూలంగా స్పందించారని అన్నారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.