- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘200 మొక్కలపై మొరం పోసి పూడ్చారు’
దిశ, మెదక్: మెదక్ జిల్లా చిలపచెడ మండలంలో రోడ్డు విస్తరిస్తున్నామని చెబుతూ హరితహారం మొక్కలపై మొరం పోసి పూడిచారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గ్రామ సర్పంచ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన మండలంలోని టోప్యతండాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. గ్రామంలో రహదారి విస్తరిస్తున్నామని చెప్పి గత ప్రణాళిక పనుల్లో రహదారి పక్కన నాటిన మొక్కలపై సర్పంచ్ భర్త బిల్యానాయక్, పంచాయతీ కార్యదర్శి హనుమంతుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మొరం పోశారు. దీంతో ఏడాదిపాటు సంరక్షించిన సుమారు 200 పైగా మొక్కలు మట్టిలో కలిసిపోయాయి. అనంతరం విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి వెంటనే ఎంపీడీవో నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంపీడీఓ సర్పంచ్ అన్నిబాయికి నోటీసులు జారీచేశారు. ఈ విషయమై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపారు.