- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్లో మీడియా కిట్టు మారడు: విజయసాయి రెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: అచ్చెన్నాయుడి అరెస్ట్ సమయంలో పోలీసులు ఇంటి గోడ దూకి అదుపులోకి తీసుకున్నారంటూ ప్రముఖ దిన పత్రికలో రాసిన వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. అచ్చెన్నను అరెస్ట్ చేసే సమయంలో గేటు తెరవకుండా కార్యకర్తలకు ఫోన్ చేసి రప్పించేందుకు యత్నించడంతోనే గేటు దూకి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని ఏసీబీ జేడీ మీడియాకు చెప్పారని తెలిపారు.
ఈ విషయాన్ని ఎల్లో మీడియా వినిపించుకోకుండా, తన ‘యజమాని’ చెప్పినట్టు రాసిందని ఆరోపించారు. దీంతో ఎల్లో కుల మీడియా బుద్ధి మరోసారి బయట పడిందని విమర్శించారు. ఎంత చెప్పినా ఈ ఎల్లో మీడియా కిట్టు మారడనీ, చెత్తపలుకులు ఆపడంటూ సదరు పత్రిక పేరును ప్రస్థావించారు. టీడీపీ నేతలు తమ వ్యాపార ప్రయోజనాలకోసమే వైసీపీలో చేరుతున్నట్టు రాస్తున్నాడనీ, కానీ, గతంలో 23 మంది వైసీపీ
ఎమ్మెల్యేలను టీడీపీ కొన్నప్పుడు మాత్రం అభివృద్ధికోసమేనంటూ ఊగిపోయి రాశాడని గుర్తుచేశారు. ఈ ద్వంద ప్రమాణాలేంటి కిట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు.
‘కరోనాపై జగన్ గారు మొహం చాటేస్తున్నారంటూ చెత్తరాతలేంటి కిట్టు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ కంట్రోల్ చేస్తున్నారు! తమిళనాడులో దుస్థితి చూడు. టీడీపీ హయాంలో ఫైల్స్ చూసి ఎక్కడ సంతకాలు పెట్టాలో చంద్రబాబుకు చెప్పి కమీషన్లు కొట్టేసేవాడివి. ఇప్పుడు ఆ అవకాశం లేదనేనా నీ బాధంతా కిట్టన్న! ’అంటూ ఎద్దేవా చేశారు.