అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్​ బెంచ్ ​ఏర్పాటు చేయండి

by srinivas |   ( Updated:2020-09-22 05:41:19.0  )
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్​ బెంచ్ ​ఏర్పాటు చేయండి
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఎన్నో కేంద్ర సంస్థలు ఉన్న విశాఖ ఇందుకు అనువైన ప్రాంతమని మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌‌లో మాట్లాడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 323 (ఏ) కింద ప్రతి రాష్ట్రంలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్స్‌ బెంచ్‌ ఏర్పాటు జరుగుతుందని ఎంపీ విజయసాయి పేర్కొన్నారు.

Advertisement

Next Story