ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమం

by Anukaran |   ( Updated:2020-08-15 08:09:25.0  )
ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు ముంబైకి చెందిన మీడియా తెలిపింది. ఆమె కుటుంబం ఇటీవల కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. మొదట ఆమె మామ గంగాధర్ రానాకు కొవిడ్-19 సోకింది. అలా ఆమె పిల్లలకు, భర్తకు ఇలా కుటుంబం మొత్తం వైరస్ బారినపడ్డారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. అయితే నవనీత్ కౌర్ ఆరోగ్యం కుదుటపడకపోగా.. శనివారం ఆమె పరిస్థితి విషమించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. దీంతో ఆమెను నాగ్ పూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ముంబై లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ అమరావతి ప్రజలతోపాటు ఆమె అభిమానులు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు.

Advertisement

Next Story