పీసీసీ నాకే వస్తుందని భావిస్తున్నా : కోమటిరెడ్డి

by Shyam |   ( Updated:2020-12-10 02:51:39.0  )
పీసీసీ నాకే వస్తుందని భావిస్తున్నా : కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ పదవిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. పార్టీని నిలబెడతా’’ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థ పాలనను జనంలోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని మండిపడ్డారు. అంతేగాకుండా తనకే పీసీసీ పదవి వస్తుందని భావిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా బలహీనంగా లేదని, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని వెల్లడించారు. 2023లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని అన్నారు.

Advertisement

Next Story