ఎంపీ అరవింద్ వీడియో సందేశం ఇదే….

by Shyam |   ( Updated:2021-04-18 02:50:11.0  )
ఎంపీ అరవింద్ వీడియో సందేశం ఇదే….
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న రోగులకోసం సరిపడా బెడ్లు, మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ని కోరారు. జిల్లాలో నిత్యం వేయ్యికి పైగా పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆదివారం ఎంపి అరవింద్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోందని, రోగులకు సరిపడా బెడ్లు, ఆక్సిజన్ సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన కలెక్టర్ కు వివరించారు.

ఈ విషయంపై కలెక్టర్ నారాయణ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 500 , ప్రైవేటు ఆసుపత్రుల్లో 1000 మొత్తంగా 1500 బెడ్లు పెంచేలా ఒకట్రెండు రోజుల్లో చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్, ఎంపీకి వివరించారు. నిజామాబాద్ జిల్లాలో సరిపడ మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వివరించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్ కొరత వంటి వివరాలు తెలియక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇట్టి వివరాలు ప్రజలందరికీ తెలిసేలా 24 గంటలు పనిచేసే ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ కు సూచించారు.

జిల్లాలో కోవిడ్ కోసం 70-75 ప్రైవేట్ ఆస్పత్రులలో మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో 500 బెడ్లు సమకూర్చితే ప్రస్తుతానికి సరిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రజలెవరూ కూడా అనవసరంగా బయట తిరగవద్దని, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించి, మాస్కులు ధరింంచాలని, ఏ చిన్న లక్షణాలు కనిపించినా టెస్టులు చేసుకొని, డాక్టర్లను సంప్రదించాలని ఎంపి ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed