Ajith kumar: దర్శకులకు కొత్త కండిషన్స్ పెడుతున్న అజిత్

by Prasanna |   ( Updated:2023-02-28 03:59:03.0  )
Ajith kumar: దర్శకులకు కొత్త కండిషన్స్ పెడుతున్న అజిత్
X

దిశ,వెబ్ డెస్క్ : హీరో అజిత్ కుడా ట్రాక్ లోకి వచ్చినట్టే కనిపిస్తుంది. ఇతర హీరోల మాదిరిగానే వరుస ప్రాజెక్టులకు స్కెచ్ వేసుకుని కూర్చుంటున్నాడు. దానిలో భాగంగానే దర్శకులకు కొత్త కండిషన్స్ పెడుతున్నారు. ఇంతకూ అజిత్ పెట్టె కండిషన్స్ ఏంటంటే? ప్రస్తుతం అజిత్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తాజాగా Lyca ప్రొడక్షన్‌తో అజిత్ కమిట్ అయ్యి తన 62 వ సినిమాకు విగ్నేష్ను తొలగించిన తరువాత కొత్తగా మగల్ తిరువేని దర్సకుడిగా వచ్చాడు. అయితే ఈ సినిమాలో అజిత్ పెట్టిన కండిషన్స్ కు తగ్గట్టుగా చేయాల్సి ఉండటంతో క్వాలిటీ ఔట్ పుట్ కరెక్ట్ టైంకు వస్తుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

తెగింపు తెలుగులో విజయం సాధించడంతో ఇప్పుడు చేయబోయే డెవిల్ ప్రాజెక్టు షూటింగ్‌ను రెండు, మూడు షెడ్యూల్స్ లో పూర్తి చేయాలనీ భావిస్తున్నాడట. అజిత్ సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో మార్కెట్ ను పెంచే పనిలో ఉన్నాడు. తన కో స్టార్స్ కు గట్టి పోటీ ఇవ్వాలని అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read...

చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..!

Advertisement

Next Story