అవును మేం విడాకులు తీసుకుంటున్నాం.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన అభిషేక్ బచ్చన్.!

by Kavitha |
అవును మేం విడాకులు తీసుకుంటున్నాం.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన అభిషేక్ బచ్చన్.!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకుంటుంది అనే వార్తలు సోషల్ మీడియాను ఎంతగా కుదిపేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ వార్తలు మరీ ఎక్కువవడంతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల అభిమానులు కూడా ఒకింత బాధకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చిన ప్రతిసారి ఈ జంట కలిసి కనిపించి అందరి నోర్లు మూయించారు. అయినప్పటికీ వీరి విడాకుల వార్తలు ఆగడం లేదు.

అయితే తాజాగా అభిషేక్ బచ్చన్ తన విడాకుల వార్తలపై స్పందిస్తూ అవును మేము నిజంగానే విడాకులు తీసుకున్నాం అంటూ మాట్లాడడం అందరిని షాకింగ్‌కి గురి చేసింది. ఆయన మాట్లాడుతూ.. మా విడాకులు నిజమే.. ఈ విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండి.. ఐశ్వర్యకు నాకు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. ఎలా బతకాలి అనేది పూర్తిగా తెలుసు. ఎవరో ఒక మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు.

నాకు ఐశ్వర్య పై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు.. ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. మీకు అందరికీ నచ్చేలా ఉండాలంటే ఉండలేం. మీ అందరిని ఇంప్రెస్ చేస్తూ ఉండాలంటే ఉండలేను. అలాగే మీడియా వాళ్ళు చెప్పే దాని మీదనే నా లైఫ్ నడవాలి అంటే నడవదు.. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. మీడియాలో వచ్చిన రూమర్స్ ‌ని నేను పట్టించుకోను. అందుకే విడాకుల రూమర్స్ పై ప్రతిసారి స్పందించలేను.. అంటూ తన విడాకుల వార్తలను ఖండించారు అభిషేక్ బచ్చన్. దీంతో ఐశ్వర్య- అభిషేక్ బచ్చన్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed