కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

by Harish |
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ సందర్బంగా పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. వాదనల సందర్భంగా కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ, ఈడీ మనీలాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత సీబీఐ అతన్ని అరెస్ట్ చేసింది. ఆయన ఉగ్రవాది కాదని, బెయిల్ మంజూరు చేయాలని అన్నారు. దీనిని సీబీఐ తరుపున న్యాయవాది వ్యతిరేకించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే కేజ్రీవాల్ సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా, అది పెండింగ్‌లో ఉంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుండి సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. అంతకుముందు ఈడీ దాఖలు చేసిన కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. మరోవైపు ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో బుధవారం ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని జూలై 12 వరకు పొడిగించింది.

Next Story

Most Viewed