ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాపై అలాంటి వార్తలు.. స్పందించి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ (పోస్ట్)

by Hamsa |
ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాపై అలాంటి వార్తలు.. స్పందించి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ (పోస్ట్)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి2898ఏడి’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ప్రజెంట్ డార్లింగ్ మారుతి డైరెక్షన్‌లో ‘రాజా సాబ్’ చిత్రం రాబోతుంది. దీనిపై ఇప్పటికీ అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

తొందరలో దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు టాక్. ఈ క్రమంలో.. తాజాగా, రాజ్ సాబ్‌కు సంబంధించిన వార్తలు కొన్ని నెట్టింట వార్తలు వైరల్ కావడంతో మేకర్స్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘ మేము కొన్ని ఫేక్ వార్తలను నోటీసు చేశాము. రాజా సాబ్ ఆడిషన్స్ జరుగుతున్నట్లు వచ్చే న్యూస్ అబద్ధం. ప్లీజ్ తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాము’’ అని ఓ ప్రకటనను షేర్ చేశారు.

Next Story

Most Viewed