Trending: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లులు చెల్లించండి ఇలా!

by Shiva Kumar |
Trending: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లులు చెల్లించండి ఇలా!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) కీలక మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో డిజిటల్ ప్లాట్ ఫాంలు అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే లాంటి యాప్‌లో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. వినియోగదారులు కేవలం టీజీఎన్పీడీసీఎల్ మొబైల్‌ యాప్‌‌లో ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని అధికారులు వెల్లడించారు. అయితే, బిల్లుల చెల్లింపును సులభతరం చేసేందుకు ఆ సంస్థ కొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో వినియోగదారుల బిల్లు తీసిన వెంటనే వచ్చే బిల్లులో కింద క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేసి ఇవ్వనున్నారు. అదే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వినియోగదారులకు ఇక మీదట ఈజీగా తమ కరెంట్ బిల్లులను చెల్లించవచ్చు. కాగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం విధానాన్ని ప్రవేశపెట్టింది.

Next Story

Most Viewed