ఆఫీసులో ఇలాంటి ఫ్రెండ్స్‌ను ఎంచుకోండి.. మీరు ఉన్నతస్థాయికి ఎదుగుతారు..

by Sujitha Rachapalli |
ఆఫీసులో ఇలాంటి ఫ్రెండ్స్‌ను ఎంచుకోండి.. మీరు ఉన్నతస్థాయికి ఎదుగుతారు..
X

దిశ, ఫీచర్స్: ఆఫీసులో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మనం చాలా సవాళ్లు ఎదుర్కొంటాం. అసలు ఏమీ తెలియని స్టేజ్ నుంచి అన్నీ తెలిసిన అనుభవపూర్వక వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటాం. మంచి పొజిషన్ లో గౌరవంగా ట్రీట్ చేయబడుతాం. ఇదంతా కొందరు స్వతహాగా స్వయం కృషితో సాధించవచ్చు కానీ ఇంకొందరు వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ సపోర్ట్ తో పొందగలుగుతారు. తమ స్నేహితులు నేర్పిన స్కిల్స్, ఇచ్చిన మద్దతుతో ముందుకు సాగిపోతుంటారు. అలాంటి వ్యక్తినే 'వర్క్ బెస్టీ'గా అభివర్ణిస్తున్న నిపుణులు.. కొందరు ఒకే ఆఫీసులో పదేళ్లకు పైగా వర్క్ చేసేందుకు కారణం కూడా ఇదే అయి ఉంటుందని చెప్తున్నారు. పని విషయంలో మనం ఒత్తిడికి గురైనప్పుడు తాను ఉన్నానని గుర్తుకు వచ్చే వ్యక్తి నిజమైన 'వర్క్ బెస్టీ' కాగా ఈ రోల్ ఇంపార్టెన్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

వర్క్ పై పాజిటివ్ ఎఫెక్ట్

ప్రతి రోజూ వందలాది మెయిల్స్ చెకింగ్, మీటింగ్స్, కాల్స్ అటెండ్ చేయడంలో బిజీ అయిపోయి కొందరు వర్క్ ప్లేస్ లో ఫ్రెండ్ షిప్ చేయడాన్ని విస్మరిస్తారు. కానీ ఇది పెద్ద మిస్టేక్ అని చెప్తున్నాయి పరిశోధనలు. మంచి వ్యక్తితో స్నేహం ఉన్నతస్థాయి విశ్వాసం, విధేయత, గౌరవానికి దారితీస్తుంది. అలాంటి వారితో కలిసి పని చేయడం వర్క్ పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. ఒక సగటు వ్యక్తి 80000 గంటలకు పైగా ఆఫీసులోనే గడుపుతున్నాడని... ఇది తొమ్మిదేళ్లకు సమానమని చెప్తున్న పరిశోధనలు అలాంటి చోట ఫ్రెండ్ ను కలిగి ఉండటం మస్ట్ అంటున్నాయి.

హెల్త్ పై ఇంపాక్ట్

ఒక ప్రాజెక్ట్ అప్పగించినప్పుడు దాన్ని పూర్తి చేసేందుకు ఆఫీసులోనే కాదు బయట కూడా కలిసి పని చేయాల్సి ఉంటుంది. దీనివల్ల స్ట్రాంగ్ బాండ్స్ ఏర్పడుతాయి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అందుకే మద్దతు, స్ఫూర్తితో పాటు వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ తో మీనింగ్ ఫుల్ కనెక్షన్స్ మంచి ఆరోగ్యానికి కూడా కారణం అవుతాయి. మెంటల్లీ హెల్తీగా ఉంచుతాయి. గ్లోబల్ కోచింగ్ ప్లాట్ ఫామ్ అయిన బెటర్ అప్ 2022 ప్రకారం ఆఫీసులో స్నేహితులు ఉన్న వ్యక్తులు తక్కువ ఒంటరితనం, ఒత్తిడి, బర్న్ అవుట్ అనుభవిస్తారు. ఇది ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్న ఎంప్లాయీస్ లో 32 రెట్లు ఎక్కువగా ఉంది.

కాంపిటీషన్ అడ్డు?

అయితే చాలా మంది తమ తోటి ఉద్యోగులతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సంకోచిస్తున్నారు. ఈ ఫ్రెండ్ షిప్ తమ ఎదుగుదలకు అడ్డుపడుతుందనే భ్రమలో ఉన్నారు. కానీ హెల్తీ కాంపిటీషన్ బెటర్ అంటున్నారు నిపుణులు. ఒకరి ఎదుగుదలకు ఇంకొకరు తోడుంటారని చెప్తున్నారు. కొన్ని కంపెనీలు ఇలాంటి బలమైన స్నేహ బంధాలను ఏర్పరిచేందుకు వీకెండ్స్ లో స్పెషల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాయి. తద్వారా సంస్థ లాభాల బాట పడుతుందని నమ్ముతున్నాయి.

ఆహ్లాదకరమైన వాతావరణం

అయితే ప్రతి ఒక్కరూ వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ బిల్డ్ చేసుకునేందుకు ఇష్టపడకపోవచ్చు. కానీ కెరీర్ కోచ్స్ మాత్రం ఇది వర్క్ లో బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్తున్నారు. తమ ఉద్యోగుల మధ్య కనెక్షన్ పెంచేందుకు కంపెనీలు వర్క్ ఫ్లో, సిస్టమ్ డెవలప్ చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల కలిగే హ్యాపీ మూమెంట్స్, టీమ్ ప్రోగ్రామ్స్ మరింత చురుగ్గా వర్క్ చేసేలా చేస్తాయి. తద్వారా టీమ్ మెంబర్స్ నుంచి ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి ఆఫీసులో బిజీగా , కఠినమైన ప్రపంచాన్ని నావిగేట్ చేయడానికి బదులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తారు వర్క్ బెస్టీస్.

Advertisement

Next Story

Most Viewed