గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో రికార్డు సృష్టించిన తండ్రి, కొడుకు.. ఎక్కడంటే?

by Anjali |   ( Updated:2024-07-08 04:07:37.0  )
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో రికార్డు సృష్టించిన తండ్రి, కొడుకు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నిన్న గ్రూప్-1 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను ఎంపిక చేశారు. మెయిన్స్‌కు 31, 382 మంది క్యాండిడేట్స్ అర్హత సాధించారు. అక్టోబర్ 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అంతేకాకుండా మెయిన్స్ ఎగ్జామ్ కు వారం ముందు నుంచే హాల్ టికెట్లు విడుదల చేస్తామని తెలిపింది. అయితే ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఓ తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన 53 ఏళ్ల తండ్రి రవికిరణ్.. జాస్తిపల్లి హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రవికిరణ్ కొడుకు మైకేల్ (25) ఓపెన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత స్టడీ ఆపేసి, తండ్రి సూచనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాడు. రిజర్వేషన్, ఇన్ సర్వీసు కోటాలో ఏజ్ లిమిట్ ఎక్కువగా ఉండటంతో తండ్రి.. అతడి సూచనలతో కుమారుడ గ్రూప్-1 ఎగ్జామ్ రాశాడు. నిన్న విడుదైన గ్రూప్-1 ప్రిలిమ్స్ లో తండ్రి, తనయుడు ఇద్దరు పాస్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed