ఎన్టీఆర్ అలా కొట్టడంతో స్టార్ హీరోయిన్‌కు మూడు రోజుల పాటు జ్వరం.. ఆమె ఎవరంటే?

by Hamsa |
ఎన్టీఆర్ అలా కొట్టడంతో స్టార్ హీరోయిన్‌కు మూడు రోజుల పాటు జ్వరం.. ఆమె ఎవరంటే?
X

దిశ, సినిమా: దివంగత హీరో తారక రామారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు టాలీవుడ్ హీరోల్లో ఆయన మనవడు ఎన్టీఆర్ ఆయనలా నటిస్తారనే పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామారావు ఎంతోమంది స్టార్ హీరోయిన్స్‌తో సినిమాలు చేశారు. అయితే అప్పట్లో ఆయనతో సాంగ్ షూట్ చేస్తే ఒళ్లు హూనమైపోయిందని చాలా మంది భయపడేవారట. ఏకంగా ఓ స్టార్ హీరోయిన్‌కు ఆయనతో సాంగ్ చేసినందుకు మూడు రోజులు జ్వరం వచ్చిందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ రివీల్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. స్టార్ హీరోయిన్ జయప్రద, సీనియర్ ఎన్టీఆర్ యమగోల మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో ఓ లమ్మి తిక్క రేగిందా సాంగ్ అప్పట్లో బాక్సులు బద్దలు కొట్టిందనడంతో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ఈ పాట వస్తే ఎంతోమంది అభిమానులు కను రెప్పలు కొట్టకుండా చూస్తారు. అయితే ఈ సాంగ్ చేసేటప్పుడు రామారావు కొట్టడంతో జయప్రదకు జ్వరం వచ్చిందట. ఈ విషయాన్ని ఆమె ఓ షోలో భాగంగా తారక్‌కు చెప్పడంతో ఆ కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story