నిరుద్యోగులకు మద్దతు ప్రకటించిన BRSV స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ అరెస్ట్.. దాసరి ఉష హౌస్ అరెస్ట్..!

by Anjali |
నిరుద్యోగులకు మద్దతు ప్రకటించిన BRSV స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ అరెస్ట్.. దాసరి ఉష హౌస్ అరెస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ ఆఫీసుని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. గ్రూప్-1 లో పోస్టులు పెంచాలని, నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని, జీవో 46 రద్దు చేయాలని, డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని బీఆర్ఎస్‌వీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు నేడు TGSPSC వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి నాయకులు, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు మద్దతు ప్రకటించి, బయల్దేరిన BRSV స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే దాసరి ఉషను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తన ఇంటినుండే నిరుద్యోగులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ NRS హాస్టల్లో మా లాంటి అభ్యర్థులను బయటికి రానీయకుండా రూమ్‌లోనే పోలీసులు నిర్బంధం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed